మార్కాపురం తహశీల్దార్ చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం ఒంగోలు నుండి మార్కాపురం వస్తున్న తహశీల్దార్ పొదిలి వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కారు డ్రైవర్ తెలిపాడు. ప్రమాదంలో తహశీల్దార్ చిరంజీవి కి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం నుంచి చిరంజీవి సురక్షితంగా బయటపడటంతో ఆయన సన్నిహితులు ఊపిరి పీల్చుకున్నారు.