మార్కాపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మార్కాపురంలోని రాయవరం సమీపంలోని లైవ్ ఓవర్ బ్రిడ్జిపై బైక్ అదుపుతప్పి ఓ యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. మృతుడు నికరంపల్లికు చెందిన ఈదా కాశిగా పోలీసులు తెలిపారు. మొదట ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కాశీని స్థానిక ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మరో యువకుడు గాయపడినట్లుగా వెల్లడించారు.

సంబంధిత పోస్ట్