ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో గురువారం బీడు భూములను మంటలు దహించి వేస్తున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో బీడు పొలాలలో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రెండు పశువుల శాలలతో పాటు ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని అధికారులు తెలిపారు. స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ తో అక్కడికి చేరుకొని అధికారులు మంటలను అదుపు చేస్తున్నారు.