మార్కాపురం రైల్వే స్టేషన్ లో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మార్కాపురంలోని విజయ టాకీస్ ఏరియాకు చెందిన అయ్యప్ప అనే వ్యక్తి రైలు పట్టాల వద్దకు చేరుకున్నాడు. మార్కాపురం నుంచి గుంటూరు వెళ్లే రైలు కింద ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. దీంతో రైలు ఢీకొన్న వెంటనే అయ్యప్ప పక్కకు పడిపోవడంతో తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే రైల్వే పోలీసులు చేరుకుని అతడిని వైద్యశాలకు తరలించారు.