మార్కాపురం: మొహరంలో అపశృతి.. తప్పిన ప్రమాదం

మార్కాపురం డిపో సమీపంలో శనివారం రాత్రి పీర్లు విద్యుత్ వైర్లకు తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో అక్కడ ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్