మార్కాపురం: చల్లబడిన భానుడు

ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ పరిధిలోని గిద్దలూరు, మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతాలలో భానుడు చల్లబడ్డాడు. 2 రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గతంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా శుక్ర, గురువారాలు మాత్రం 37° డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మే 25వ తేదీ నుంచి రోహిణి కార్తీ ప్రారంభం అవుతుందని వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్