ప్రకాశం: సప్లై ఛానల్ కాలువకు మరమ్మతులు చేపట్టిన ఎమ్మెల్యే

ప్రకాశం జిల్లా మార్కాపురంలో, సోమవారం ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆధ్వర్యంలో గుండ్లకమ్మ నుంచి చెరువుకు వెళ్లే సప్లై ఛానల్ కాలవ మరమ్మత్తు పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. నీటి వృధాను అరికట్టి, మొత్తం నీరు చెరువులోకి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. గుండ్లకమ్మ నీరంతా ఈ సప్లై ఛానల్ ద్వారానే చెరువులోకి చేరాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్