మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. గో బ్యాక్ జగన్ అంటూ నిరసన తెలియజేస్తున్న మహిళలపై గుర్తుతెలియని వ్యక్తి రాయి విసిరాడు. పక్కనే వీడియో చిత్రీకరిస్తుండగా ఆ వీడియోలో రాయి విసిరిన దృశ్యాలు నమోదయ్యాయి. బుధవారం పొగాకు రైతులు పరామర్శించేందుకు జగన్ పొదిలికి వచ్చారు. రాయి దాడిలో గాయపడ్డ మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.