ప్రకాశం జిల్లా పొదిలి మండలం అగ్రహారం సమీపంలో శుక్రవారం బొలెరో, టిప్పర్ లారీ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి పొదిలికి వస్తున్న బొలెరో వదిలి నుంచి చీమకుర్తి వైపు వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొన్నాయి. మృతుడు ప్రసాద్ తో పాటు గాయపడ్డ ఇద్దరు ఒంగోలుకు చెందిన వ్యక్తులుగా పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం గుంటూరుకు తరలించారు.