ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలో బుధవారం కారు ద్విచక్ర వాహనదారుడిని ఢీకొన్న సంఘటనలు ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడు గోగినేనివారిపాలెంకు చెందిన శ్రీను అనే వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. గాయపడ్డ వ్యక్తిని అంబులెన్స్ లో అతనిని ఒంగోలులోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై తమకు ఎటువంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.