ఇంటి నిర్మాణం చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన మార్కాపురం పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన దుర్గారావు బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విద్యుత్ కార్యాలయం దగ్గర ఓ భవన నిర్మాణం చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.