సర్వసభ సమావేశానికి పిలిచి అవమానించారని తర్లుపాడు జడ్పిటిసి వెన్న ఇందిరా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో చక్రపాణి ప్రసాద్ ఆధ్వర్యంలో సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. జడ్పిటిసి ఇందిరాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా సమావేశం ముగించడంతో వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉండేదానికి నన్నెందుకు పిలిచి అవమానించారని జెడ్పిటిసి ఆగ్రహం వ్యక్తం చేశారు.