మార్కాపురం జిల్లా తొలి జడ్పీ చైర్మన్ ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పుల్లలచెరువు మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు శనగా నారాయణ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలు, పార్టీ కార్యకర్తలు-నాయకులతో అనుబంధం, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్లో అనుభవం, ప్రజా సమస్యలపై స్పందించే తత్వం ఆయనకు బలాలుగా యర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మార్కాపురం జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఆయనేనా అనే చర్చ జోరుగా సాగుతోంది.