ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం అంతర్జాతీయ టీచర్స్ డే సందర్భంగా యుటిఎఫ్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఉపాధ్యాయులకు ప్రస్తుతం యాపులు పెద్ద సమస్యలు కావని, విద్యార్థులను తీర్చిదిద్దడమే ప్రధాన బాధ్యత అని అన్నారు. 2014-19 మధ్య పాఠశాలల అభివృద్ధికి కృషి చేశానని, ప్రస్తుతం ప్రభుత్వం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, వారిని ఉత్తమంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందని ఆయన పేర్కొన్నారు.