ఒంగోలులో బీటా జిల్లా సర్వసభ్య సమావేశం

ప్రకాశం జిల్లా ఒంగోలులోని హెచ్ఎం అసోసియేషన్ భవనంలో బీటీఏ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా దేవసహాయం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, సీపీఎస్ను ఓపీఎస్గా మార్చినందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేశ్ సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. పీఆర్సీ కమిషన్, 30% ఐఆర్, పెండింగ్ డీఏలు, సరెండర్ లీవ్స్ మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్