ఒంగోలులో అగ్రహారం రైల్వే గేట్ వద్ద అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం కోసం రైల్వే కమిషన్ అధికారులతో మేయర్ గంగాడ సుజాత గురువారం సందర్శించారు. బ్రిడ్జి నిర్మాణానికి త్వరగా పనులు ప్రారంభించాలని మేయర్ సూచించారు. అలాగే పనులు జరిగే తీరు గురించి రైల్వే అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారులు, కార్పొరేటర్లు, రైల్వే అధికారులు, పలువులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.