ఒంగోలు లో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో మే 20న ఉదయం 10 గంటలకు పాత రిమ్స్ కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి అధికారి టి. భరద్వాజ శనివారం తెలిపారు. 18-20 ఏళ్ల వయస్సు కలిగి పదవ తరగతి, ఐటీఐ, ఇంటర్ లేదా డిగ్రీ విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు హాజరుకావచ్చు. అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో పాల్గొనాలని కోరారు. పలు కంపెనీలు పాల్గొననున్నాయి.