కొత్తపట్నం మండలం రెడ్డిపాలెంలో సోమవారం దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య ఘర్షణ చేలరేగి అది దాడికి దారి తీసింది. తమ్ముడు శ్రీనివాసులు గడ్డపారతో అన్న నాంచర్లపై దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది రక్తపు మడుగులో ఉన్న నాంచర్లను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.