వరుస చోరీలు జరుగుతూ ఉండడంతో పోలీసులకు సవాలుగా మారింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో గత నెల రోజులుగా రొయ్యల చెరువుకు చెందిన విద్యుత్ నీటి మోటార్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. శుక్రవారం కొప్పోలు, అల్లూరు గ్రామాల మధ్య ఉన్న ఓ నీటి మోటార్ ను దొంగలు దొంగిలించేందుకు ప్రయత్నించగా స్థానికులు అప్రమత్తం కావడంతో దొంగలు పరారయ్యారు. వరుస చోరీలపై దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు చెబుతున్నారు.