ప్రకాశం బ్యారేజీ గేట్ల ఎత్తివేత: అధికారులు అప్రమత్తం

మురసు తుఫాను కారణంగా స్థానిక పరీవాహక ప్రాంతాల నుంచి కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య ప్రకాశం బ్యారేజీ గేట్లను ఎత్తి, సుమారు 5 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల అదనపు నీటిని దిగువకు విడుదల చేయాలని అధికారులు ప్రతిపాదించారు. నదికి వరద ఉధృతి పెరుగుతున్నందున, బ్యారేజీ ఎగువ మరియు దిగువ ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పరివాహక ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕