ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన మున్సిపల్ కార్మికుడు పాటిబండ్ల బ్రహ్మయ్య, తన భార్య కుమారి పేరు మీద బజాజ్ ఫైనాన్స్ నుండి తీసుకున్న లక్ష రూపాయల లోన్ వాయిదా రూ. 5220 కట్టలేదని, లోన్ ఏజెంట్లు మూడు రోజులు ఇంటికి వచ్చి వేధించారని తెలిపారు. డబ్బులు లేవని, రెండు రోజుల తర్వాత పెనాల్టీతో సహా కడతానని చెప్పినా వినకుండా, కార్యాలయం వద్ద సహచర కార్మికుల ఎదుట నిలదీయడంతో మనస్తాపం చెందిన బ్రహ్మయ్య, పొలాలలో ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు స్పందించి అతన్ని ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.