పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన మంత్రి

ప్రకాశం జిల్లా మద్దిపాడులోని వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సందర్శించారు. వేలం ప్రక్రియను పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని, సీఎం స్వయంగా కొనుగోలు కంపెనీలతో సమావేశమై చర్చించారని తెలిపారు. రైతుల ప్రయోజనాలను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్