ఒంగోలు నగర శివారులో వజ్ర ఫ్యామిలీ రెస్టారెంట్ వద్ద గురువారం రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. త్రోవ గుంట నుంచి నగరంలోకి వస్తున్న ఓ బైక్ ను వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చెరువుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన నారపరెడ్డి (37)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.