నేడు ఒంగోలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

ఒంగోలు నగరంలోని వివిధ ప్రాంతాలలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ డీఈఈ పాండురంగారావు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ లైన్లలో మరమ్మత్తుల కారణంగా ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామని, నగరంలోని కూరగాయల మార్కెట్, ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాలలో, ఊర చెరువు, సమైక్యత నగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్