ప్రకాశం జిల్లాలో అటవీ శాఖలో మొత్తం 75 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. బీట్ ఆఫీసర్ (ఫ్రెషర్) 23, CF 10, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (ఫ్రెషర్) 37, CF 5 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ పాసై, వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉన్న అభ్యర్థులు ఆగస్టు 5లోపు APPSC వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జీతం రూ.23,000 నుంచి రూ.80,000 వరకు ఉంటుంది.