ఒంగోలులో రాజకీయం ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. నగర మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. అయితే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి శిష్యురాలిగా పేరుగాంచిన మేయర్ గంగాడ సుజాత పార్టీ మారడంపై వైసీపీలో కొంత విస్మయం వ్యక్తం అయింది. బాలినేనిపై విమర్శలు చేస్తే చాలు రివర్స్ పంచ్ ఇచ్చే మేయర్ పార్టీ మారగా, మిగిలిన క్యాడర్ ను కాపాడుకునేందుకు బాలినేని ఏం చేస్తారని చర్చలు జోరందుకున్నాయి.