రహదారి ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పేర్నమిట్ట వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్నది. ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనటంతో పేర్నమిట్టకు చెందిన భాను ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి పంచనామా నిమిత్తం ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు.