చీమకుర్తి; పట్టపగలే దొంగ హల్చల్

పట్టపగలే ఓ దొంగ మహిళ ఒంటిపై బంగారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటన ఆదివారం చీమకుర్తి వీవర్స్ కాలనీలో చోటుచేసుకుంది. పద్మజ అనే మహిళ ఇంటి ఆవరణలో ఉన్న సమయంలో ఇంటిలోకి ప్రవేశించిన దొంగ ఆమె మెడలో నుంచి బంగారాన్ని దొంగిలించేందుకు యత్నించాడు. పద్మజా పెద్ద పెద్దగా కేకలు వేయడంతో ఆమెపై దాడి చేసి దొంగ పరారయ్యాడు. గాయాల పాలైన మహిళను ఆసుపత్రికి తరలించి పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్