చీమకుర్తి మండలం నేకునంబాద్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. ట్రాన్ ఫార్మర్ లోని విద్యుత్ తీగలను చోరీ చేసేందుకు వెళ్లి నాగార్జున అనే దొంగ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతుడు సంతనూతలపాడు కు చెందిన వ్యక్తిగా పోలీసులు తెలిపారు. జరిగిన ఘటనపై పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.