ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలోని నెహ్రూ నగర్ లో రాము అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు నెలల క్రితం భార్య నుంచి విడాకులు తీసుకున్న రాము, కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాము ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.