రేపు ప్రకాశం జిల్లాకు మంత్రి లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు రానున్నట్లుగా టీడీపీ నాయకులు తెలిపారు. దారుణ హత్యకు గురైన మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించనున్నారు. గత నెల 22న ఒంగోలులోని తన కార్యాలయంలో హత్యకు గురైన వీరయ్య చౌదరి అంత్యక్రియలలో సీఎం చంద్రబాబు పాల్గొన్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్