ఎస్. ఎన్ పాడు: నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

మద్దిపాడు మండలంలో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా విద్యుత్ శాఖ ఏఈ చిన్నారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ లో 33 కేవీ విద్యుత్ లైన్ మారుస్తున్న క్రమంలో శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నామని తెలిపారు. కొత్త లైన్ వేస్తున్న కారణంగా విద్యుత్ నిలిపేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్