సంతనూతలపాడు: వ్యక్తి అదృశ్యం

సంతనూతలపాడు మండలం ముద్దులూరు ఎస్సీ కాలనీకి చెందిన నేలకూరి మాల్యాద్రి ఈనెల 5వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఒంగోలులో కూలి పనులకు వెళ్లిన మాల్యాద్రి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వివిధ ప్రాంతాలలో అన్వేషించి తర్వాత పోలీసులను ఆశ్రయించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఎవరైనా మాల్యాద్రిని గుర్తిస్తే 7995732991 నంబర్ ను సంప్రదించి సమాచారం ఇవ్వాలని కుటుంబీకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్