సంతనూతలపాడు చెరువు కట్ట సమీపంలో రహదారి ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. చీమకుర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రామిరెడ్డి శుక్రవారం తన విధులను ముగించుకొని పెర్నమిట్ట లోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో సంతనూతలపాడు లో స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో శరీరం చిద్రమైంది. స్థానికులు వెంటనే వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.