దోర్నాలలో తప్పిన పెను ప్రమాదం

దోర్నాల మండలం బొమ్మలాపురం సమీపంలో మంగళవారం స్కూల్ బస్సు బైకును ఢీకొనగా వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో పెను ప్రమాదమే తప్పింది. స్కూల్ బస్సు రోడ్డు పక్కనున్న పొదల్లోకి దూసుకెళ్లి హైటెన్షన్ విద్యుత్ స్తంభానికి సమీపంలో నిలిచిపోయింది. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఉంటే విద్యుత్ తీగలు బస్సుపై పడి పెను ప్రమాదం సంభవించి ఉండేది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్