స్కోప్ పౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యం, పరిశుభ్రత పై అవగాహన

గుంటూరు జిల్లా నందివెలుగు రోడ్డులోని బాలాజీ నగర్ సమీప యానాది కాలనీలో గురువారం స్కోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి లాయర్ దినేష్ బాబు మాట్లాడుతూ, కాలువల పక్కన నివసించేవారు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. పిల్లల ఆరోగ్యం, స్వచ్ఛమైన త్రాగునీరు, పోషకాహారంపై శ్రద్ధ చూపాలని కోరారు.

సంబంధిత పోస్ట్