మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం ముటుకులలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లో పడి శివపార్వతి అనే మహిళ మృతి చెందింది. దుర్గికి చెందిన శివపార్వతి బంధువులతో కలిసి ముటుకుల వద్ద గుడారాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ట్యాంక్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు శనివారం తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.