సుదీర్ఘకాలం పాటు విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు వైద్యాధికారులను శాశ్వతంగా తొలగిస్తూ వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలిక సెలవులో ఉన్న 70 మందిని డిస్మిస్ చేయగా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కందుకూరులో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులను శనివారం తొలగించారు. ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం పెంచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.