ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం తోకపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని మృతదేహం ఆదివారం కలకలం రేపింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు వివరాలు తెలియలేదని ఎవరన్నా మృతుడిని గుర్తిస్తే 9121102186 నంబర్ కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నామని తెలిపారు.