పుల్లలచెరువు: పేకాట ఆడుతున్న 9 మంది అరెస్ట్

పుల్లలచెరువు మండలం మానేపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం పేకాట ఆడుతున్న 9 మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10,150 నగదును స్వాధీనం చేసుకున్నామని పుల్లలచెరువు ఎస్ఐ వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతుంటే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్