గ్రామాన్నే తన పేరుతో ఆన్లైన్ చేయించుకొని బ్యాంకులో తాకట్టు పెట్టి ఋణం పొందిన వ్యక్తిపై కేసు నమోదైంది. పుల్లలచెరువు మండలం సిద్దెనపాలెం గ్రామానికి చెందిన గడ్డం సుబ్బయ్య, రామకోటయ్య అనే వ్యక్తులు గ్రామ నంబర్ 296లో 8 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లతో ఆన్లైన్ చేసుకొని బ్యాంకు లోను పొందారు. గ్రామస్థులు ఫిర్యాదుతో కేసు నమోదు కాగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టు ఎస్ఐ సంపత్ కుమార్ శనివారం తెలిపారు.