పుల్లలచెరువు మండలం రెంటపల్లికి చెందిన మతిస్థిమితం లేని మస్తానమ్మ గురువారం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు వివరించారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా వృద్ధురాలు కనిపించకుండా పోయిందన్నారు. గ్రామ పరిసర ప్రాంతాలు, బంధువుల ఇళ్లల్లో వెతికినా తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం తెలిపారు. ఎవరన్నా వృద్ధురాలిని గుర్తిస్తే 9182117673 నంబర్ కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.