ప్రకాశం: పాడుపని చేస్తూ.. అడ్డంగా బుక్కయ్యారు

ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మటుకుల గ్రామంలో బుధవారం పేకాట ఆడుతున్న ఐదు మందిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 6, 100 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. పేకాట ఆడుతున్న వారిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్