పుల్లలచెరువు మండలం పెద్ద పీఆర్సీ తండాకు చెందిన ప్రవీణ్ నాయక్.. శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ లో గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై డీఎస్పీ వివేకానంద క్లారిటీ ఇచ్చారు. బీ.టెక్ మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయిని ప్రవీణ్ ప్రేమించాడని.. ఆ విషయం ఆమెకు చెప్పడంతో తిరస్కరించిందని వివరించారు. ప్రేమ వద్దని స్నేహితులుగా ఉందమని ఆ విద్యార్థిని చెప్పిందన్నారు. క్షణికావేశంలో ప్రవీణ్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు.