గుంటూరులోని స్థానిక బాలాజీ నగర్ లో శనివారం స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డా. దేవరకొండ కొండలరావు ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్. పి. వేణు గోపాల్ (వైస్ ప్రిన్సిపాల్, హిందూ కాలేజీ, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నెంబర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ) చేతుల మీదుగా వృద్ధులకు దుస్తులు, విద్యార్థులకు స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలు స్కోప్ ఫౌండేషన్ అందిస్తున్న సేవలను కొనియాడారు.