మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం వైయస్సార్ సెంటర్ నురాని మజీద్ ఆవరణంలో సోమవారం జమియతుల్ ఉలిమా ఏ హింద్ ఆధ్వర్యంలో 'సర్ ' సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. పలువురు బీఎల్‌వోలు తమకు ఇచ్చిన పత్రాలను ఎలా పూర్తి చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నవారికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని సంస్థ కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కేంద్రం ద్వారా బీఎల్‌వోలకు అవసరమైన సహాయం అందించబడుతుంది.