ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం టిడిపి ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుపై స్థానిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వర్గానికి అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ యువకుడు ఎరిక్షన్ బాబుపై అసహనం వ్యక్తం చేశాడు. ఇన్ని రోజులనుంచి పార్టీకి అండగా ఉన్నామని అండగా ఉన్న వాళ్లను మర్చిపోవడం మంచిది కాదని అన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.