దర్శి మండలంలోని చలివేంద్ర వద్ద మంగళవారం పొగాకు పనులకు వెళ్తున్న మహిళా కూలీలతో కూడిన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. వెంకటచలంపల్లి గ్రామానికి చెందిన ఈ కూలీలు ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అంకాళ కాశమ్మ తలకు, మామిడికాయల వెంకటలక్ష్మమ్మ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురు మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.