రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

సోమవారం సాయంత్రం గుంటూరు సమీపంలోని చౌడవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముండ్లమూరు మండలంలోని వేములబండ గ్రామానికి చెందిన రాజేష్ (28) అనే యువకుడు మృతిచెందాడు. హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రాజేష్, భార్య పుట్టింట్లో ఉండటంతో రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్