దర్శి మున్సిపల్ కమిషనర్ ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు

ప్రకాశం జిల్లా దర్శిలో శనివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు నిర్వహించింది. స్థానిక మున్సిపల్ కమిషనర్ వై. మహేశ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు కడప ఏసీబీ సీఐ రామకృష్ణ తెలిపారు. దాడుల్లో భాగంగా కొన్ని డాక్యుమెంట్లు, కొంత బంగారం, మరికొన్ని ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మహేశ్‌కు సంబంధించిన ఆదాయ వనరులపై అంచనా వేస్తూ దర్యాప్తు కొనసాగుతోందని సీఐ రామకృష్ణ తెలిపారు.

సంబంధిత పోస్ట్